11. స్వాతంత్ర్యానికి సాంస్కృతిక పునాది: సంస్కృతి మన స్వభావమే గనుక జాతీయ దృష్టితో దానిని మనం పరిగణించ వలసి వుంటుంది. ఒకరి స్వాతంత్ర్యం వారి స్వీయసంస్కృతితో పెనవేసుకొని వుంటుంది. స్వాతంత్ర్యానికి సంస్కృతి ప్రాతిపదిక అవకపోతే స్వాతంత్ర్యం కోసం సాగే రాజకీయ ఉద్యమం స్వార్థపరులైన, పదవీలాలసపరులైన వ్యక్తుల పెనుగులాటగా దిగజారుతుంది. మన సంస్కృతిని అభివ్యక్తం చేసే సాధనంగా అయినపుడు మాత్రమే స్వాతంత్ర్యం అర్ధవంతం కాగలదు. అలాంటి అభివ్యక్తీకరణ మన పురోగతికి దోహదం చేయడం మాత్రమేగాక దానికోసం చేయవలసిన కృషి మనకు ఆనందానుభూతిని కూడా ఇస్తుంది.
0 Comments