ఐరోపా జాతీయవాదం వినాశకరం

25. ఐరోపా జాతీయవాదం వినాశకరం: ఐరోపా దేశాలలో జాతీయవాదం వినాశనానికి దారి తీసింది. కాని ఈ కారణంగా భారత జాతీయవాదాన్ని వినాశకరమంటే మూతి కాలిన పిల్లి పాలకు భయపడినట్లే వుంటుంది. ఐరోపావేశాల మాదిరిగానే మన జాతీయవాదం విపత్కరంగా పరిణమిస్తుందని భావించటం తప్పు. ఈమాట ఊరికే చెప్పటంలేదు. ఇదొక సత్యం.వేల సంవత్సరాల భారతీయ జాతీయవాద చరిత్ర ఈ సత్యాన్ని బలపరుస్తున్నది. దాదాపు వేయిసంవత్సరాల ఈ ప్రపంచదేశాల చరిత్ర మొత్తం విధ్వంస దృశ్యాలతో నిండివున్నది కాగా భారతదేశపు సుదీర్ఘ చరిత్రలో మానవుడికి దు:ఖాన్ని కలిగించిన ఘట్టాలను వర్ణించే పుట ఒక్కటైనా లేదు. భారత దేశపు చరిత్ర మొత్తం సమస్త ప్రపంచం పట్ల సద్భావనతోనే నిండివున్నది. సమస్త సృష్టియొక్క శ్రేయస్సు కోసమే భారతదేశం పరిశ్రమించిందన్న సత్యాన్ని ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో బయల్పడిన భారతీయ చరిత్ర యొక్క అవశేషాలు ఈనాటికీ చాటిచెబుతున్నాయి. అందువల్ల సత్యమేమంటే పరస్పర ఘర్షణ, ద్వేషం, స్పర్ధల ఫలితంగా ఉత్పన్నమైన పాశ్చాత్య జాతీయ వాదపు దారుణ ప్రభావాలనుంచి ప్రపంచాన్ని కాపాడాలంటే భారతీయ జాతీయవాదాన్ని మనం సంఘటితం చేసి బలోపేతం చేయాలి. ప్రపంచ శ్రేయస్సుకు మార్గం ఇదే.

Post a Comment

0 Comments