71, కమ్యూనిస్టు విద్రోహం: టిబెట్ లోని పరిణామాలు, ఆ విషయంలో భారత కమ్యూనిస్టు పార్టీ అనుసరించిన విధానం మరోసారి ఈ పార్టీయొక్క అభారతీయ లక్షణాన్ని బట్టబయలు చేశాయి. టిబెట్లోని ఆర్థిక, రాజకీయ వ్యవస్థలు ఏవైనప్పటికీ వాటిని బలవంతంగా మార్చేహక్కు బయటివారెవరికీ లేదు. పెకింగ్ (బీజింగ్)ను ప్రతిధ్వనించే భారతీయ కమ్యూనిస్టులు దలైలామా ప్రభుత్వం పాటిస్తున్నట్లు చెబుతున్న ప్రతిక్రియాత్మక లక్షణాలను కారణంగా చలాపుతూ టిబెట్లో చైనా రాక్రమణను సమర్ధించగలిగితే ఇక్కడి ప్రభుత్వం కూడా ప్రతిక్రియాత్మకంగా” కొనసాగుతున్నట్లు వారికి అనిపిస్తే కోరల్లోనూ అలాంటి దురాక్రమణను వారు స్వాగతించవచ్చు. ఇది నీచమైన విశ్వాదసఘాతుకత్వమే తప్ప మరేమీశాడు. వారు బలాన్ని పుంజుకొని ఏదోఒకనాటికి భారతదేశపు స్వాతంత్ర్యానికి, భద్రతకు ఎసరు పెట్టకుండా చూడటం దేశభక్తుడైన ప్రతి భారతీయుడి విద్యుక్త ధర్మం.
భారత మాతాకీ జై
భారత మాతాకీ జై
0 Comments