ద్రావిడ ప్రాణాయామం - inspirational stories in telugu - bruyat

ద్రావిడ ప్రాణాయామం
శ్రీ దత్తోపంత్ జీ INTUC లో పనిచేసే రోజులవి. ఆ సమయానికి పాత మధ్యప్రదేశ్ గృహశాఖ మంత్రి శ్రీ ద్వారకా ప్రసాద్ మిశ్రా తో సత్సంబంధాలుండేవి. ఆయన ఇంటిలో పిల్లాడు లాగా ఉండేవాడు.ఏ సమయంలోనైనా సరే వారి ఇంట్లోకి వెళ్ళగలిగేంత స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఠేంగ్డేజీ కి ఉండేవి. మిశ్రా గారికి ఆరెస్సెస్ పేర్కొనే హిందుత్వం పట్ల సదభిప్రాయం ఉండేది కానీ సంఘ స్వయంసేవకులు , కాంగ్రెస్ వలెంటీర్లలాగా పనిచేయరు అనే కోపమూ ఉండేది. మిశ్రా గారి కారణంగానే ఠేంగ్డేజీ INTUC లో చేరారు. ఒక రోజు ఉదయమే మిశ్రా గారింటికి వెళ్ళారీయన. ఆ సమయానికి దినపత్రిక చదువుతూ , అల్పాహారం చేయడానికి వేచి ఉన్నారాయన.ఠేంగ్డేజీ కనబడగానే అల్పాహారం చేయడానికి పిలిచారు.
అల్పాహారం చేస్తుండగానే, ఈ రోజు దినపత్రిక చదివావా ? అనడిగారు ఠేంగ్డేజీ ని. చదివాననగానే , డాక్టర్ డెకాటె నా గురించి చాలాచాలా వ్రాశాడు అన్నారు.అదికూడా చదివాననగనే, ఆశ్చర్యం ! ఇన్ని రోజులుగా రాజకీయాలలో ఉన్నా ,రాజకీయం మాత్రం తెలీదు అన్నారు మిశ్రా గారు.ఇందులో మర్మమేమిటి ? అని ఠేంగ్డేజీ అడిగారు.దానికి మిశ్రా గారు, రాజకీయాలలో ఎవరోఒకరి కాళ్ళు పట్టుకుని క్రిందికి లాక్కొచ్చే పని చేయాల్సి ఉంటుంది. అయితే
దానికొరకు సాధారణమైన, మామూలు మార్గాన్ని వదలిపెట్టి మనుషులు ద్రావిడ ప్రాణాయామం చేస్తుంటారు. ఆ వ్యక్తి గురించి ఉపన్యాసమివ్వడం , వ్యాసం వ్రాయడం,ప్రచారంచేయడం,చెవులు కొరకడంలాంటి పనులన్నీ వ్యర్థం అన్నారు.
అదివిన్న దత్తోపంత్ జీ, మరైతే మామూలు ప్రాణాయామం ఎలా ఉంటుంది ? అని ప్రశ్నించారు.ఆ ప్రశ్నకు సమాధానంగా , ఈ రకమైన వ్యతిరేక ప్రచారం చేయడంకొరకు సమయం, శక్తి కేటాయించాల్సిన అవసరం లేదు. సరళమైన ఉపాయం ఏమిటంటే , ఆ వ్యక్తి పట్ల పూర్వాగ్రహ దోషం లేకుండా వ్యవహరించడమే. ఒకసారి ఆ వ్యక్తి యోగ్యతను అర్థంచేసుకోవాలి. అతడు ఏ పదవికి అర్హుడో గుర్తించాలి. ఆ తర్వాత అ పదవికంటే ఎన్నో రెట్లు ఎక్కువ స్థాయి పదవిలో అతడిని కూర్చోబెట్టాలి. దాంతో అతడికీ అనందం కలుగుతుంది. ఎంతో సంతోషంగా అ పదవిలో పనిచేస్తూ పోతాడు. మీరేమీ చేయవద్దు, కేవలం తమాషా చూస్తూ ఉండండి. కేవలం మూడున్నరేళ్ళ లోపల అతడు తనంతటతాను కుప్పకూలిపోతాడు అని శ్రీ ద్వారకాప్రసాదు మిశ్రా అన్నారు.
ఈ మాటలన్నీ విన్న శ్రీ దత్తోపంత్ జీ కి కొత్త దృష్టికోణం అలవడింది.

Post a Comment

0 Comments