కమ్యూనిష్టుల పూజ
1968 లో రష్యాలో భారత పార్లమెంటేరియన్ల ప్రతినిధి బృందం పర్యటించింది. ఆ బృందం ఒకరోజు అక్కడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్ ను సందర్శించింది.అక్కడ భారతబృందంలోని కమ్యూనిష్ట్ పార్లమెంటేరియన్ శ్రీ హిరేన్ ముఖర్జీ ఉపన్యాసం ఏర్పాటుచేయబడింది. కొంతమంది రష్యన్ మేధావులు కూడా పాల్గొన్నారు.శ్రీ హిరేన్ ముఖర్జీ మాట్లాడాల్సిన అంశం ' రిలిజియన్ అండ్ గాడ్ ' . మార్క్సిజం ఆధారంగా ఆయన ధర్మం ను చీల్చిచెండాడి ' God is Fraud ' అని నిరూపించారు. ఆరోజున మాకెవరికీ ఆ విషయంపై వాదోపవాదాలు చేయడానికి అవకాశమే లేదు.హోటల్ కు తిరిగివచ్చాక మధ్యాహ్న సమయంలో ఒక పుస్తకం తిరిగి ఇచ్చేయడానికి శ్రీ దత్తోపంత్ ఠేంగ్డే , ముఖర్జీ గారి గదికి వెళ్ళారు. గదికి ఉన్న గంటను మ్రోగించారు. అయితే ముఖర్జీ గారు తమ చెవులలోని Hearing Aids ను తీసి పక్కన పెట్టినట్లున్నారు. దాంతో స్పందన రాలేదు. ఇటువైపేమో ఠేంగ్డేజీ మరో పని మీద త్వరగా వెళ్ళిపోవాల్సి ఉంది. పరిశీలనగా చూడగా తలుపు దగ్గరగా వేసినట్లు తెలిసింది. ఆ సందులో నుండి చూడగా, తలుపు వైపుకు వీపు చేసి బాసింపట్టు వేసుకుని హీరేన్ ముఖర్జీ గారు కూర్చొని ఉన్నారు. మనం ధ్యానం చేయడానికి ఎలా కూర్చుంటామో ,అలా అచ్చుకట్టినట్టుగా ఆయన కూర్చొని ఉన్నారు. దాంతో శ్రీ దత్తోపంత్ జీ మెల్లగా గదిలోకి ప్రవేశించి, శ్రీ హీరేన్ ముఖర్జీ వెనుకకు వెళ్ళి నిలబడ్డారు. అయినా ఈ విషయం శ్రీ ముఖర్జీ కి తెలిసే అవకాశం లేకపోయింది. అలా నిలబడ్డాక ఆశ్చర్యపోవడం శ్రీ ఠేంగ్డేజీ వంతయింది. శ్రీ ముఖర్జీ ధ్యానముద్రలో కూర్చొని , ' చిదానందరూపః శివోహమ్ శివోహమ్ ' అనే స్తోత్రం చదువుతున్నారు. శ్రీ ఠేంగ్డేజీ మౌనంగా నిలబడ్డారు. రెండు నిమిషాల తర్వాత స్తోత్రాన్ని ముగించి , శ్రీ హీరేన్ ముఖర్జీ లేచారు. వెనుదిరిగి చూడగా , శ్రీ దత్తోపంత్ జీ కనబడ్డారు. ఉలిక్కిపడి ఆంగ్లంలో ' How long you are standing here ? అని శ్రీ ముఖర్జీ ప్రశ్నించారు.అందుకు శ్రీ ఠేంగ్డేజీ కూడా ' Two or Three Minutes ' అన్నారు. అపుడు శ్రీ హీరేన్ ముఖర్జీ ' Mind you, I don't believe in God ' అన్నారు. దానికి శ్రీ ఠేంగ్డేజీ, 'మంచిదే' అన్నారు.
0 Comments