పాడనా తెలుగు పాట. - bruyat

మాతృ భాషా దినోత్సవం
అందరికి శుభాకాంక్షలు.
'' పాడనా తెలుగు పాట. "

తెలుగు బాష గొప్పదనాన్ని ఇతర దేశాలు వారు కూడా మెచ్చుకుని పరవశించి పాడిన మన తెలుగు పాట

చిత్రం : అమెరికా  అమ్మాయి                                                                
గానం: పి.సుశీల 
మ్యూజిక్:  జి.కే. వెంకటేష్ 
లిరిక్స్ :  దేవులపల్లి  కృష్ణ  శాస్త్రి 

పాడనా తెలుగుపాట! పరవశమై  - మీ ఎదుట - మీ పాట
పాడనా తెలుగు పాట

కోవెల గంటల గణ గణలో - గోదావరి తరగల గల గలలో
మావుల పూవుల మోపులపైనా - మసలే గాలుల గుసగుసలో
మంచి ముత్యాల పేట - మధురామృతాల తేట - ఒక పాట || పాడనా

త్యాగయ క్షేత్రయ రామదాసులు - తనివితీర వినిపించినది
నాడు నాడులా కదిలించెది - వాడ వాడలా కనిపించెది
చక్కెర మాటల మూట - చిక్కని తేనెల వూట - ఒక పాట || పాడనా

వళ్ళంత వయ్యారి కోక - కళ్ళకు కాటుక రేఖ
మెళ్ళో తాళి - కాళ్ళకు పారాణి - మెరిసే కుంకుమ బొట్టు
ఘల్లు ఘల్లున కడియాలందెలు - అల్లనల్లన నడయాడె
తెలుగుతల్లి పెట్టని కొట - తెనుగును నాటె ప్రతిచోట - ఒక పాట || పాడనా

Post a Comment

0 Comments