ప్రతి వ్యక్తీ సైనిక దృష్టితో శిక్షణ పొందాలి అన్న శ్రీ సావర్కర్ - గురూజీ
....శ్రీ రాముడు జన్మించినప్పుడు, గొప్ప గొప్ప ఋషులు, తత్వజ్ఞులు ఎంతమంది లేరు. వశిష్ఠునిలాంటి బ్రహ్మర్షి ఉన్నాడు. అందరున్నా రాష్ట్రానికి రక్షణ లేకుండా పోయింది. ఆ సంరక్షణ కోదండధారియైన రాముని ధనుస్సు వల్ల లభించింది.
ఛత్రపతి శివాజీకి పూర్వమే మహారాష్ట్రలో సాధుసంత పరంపర ఉంటుండేది. భజనపూజనలు, పండరి పురానికి యాత్రలు ఘనంగా తన్మయపూర్వకంగా జరుగుతుండేవి. కాని చివరికి ధర్మ రక్షణ కొరకు శివాజీ మహారాజు ఖడ్గాన్ని అశ్రయించ వలసి వచ్చింది కదా!.....
...డా. మూంజే సైనికీకరణం కొరకు చాలా కృషి చేశారు. ఆ తరువాత మహా తీవ్రమైన స్థాయిలో, సశక్తంగా గొంతెత్తిన వాడు మనమీనాడు ఎవరిని స్మరించుకోడానికి సమావేశమైనామో, ఆ మహా మానవుడు శ్రీ సావర్కర్.
ఆయన దృఢమైన, ప్రభావోపేతమైన బలమైన గొంతుకతో హిందూరాష్ట్రం మొత్తం క్షాత్రవృత్తితో నిండిపోవాలి. బాలుడైనా వృద్ధుడైనా ఒక్కొక్కడు నిర్భయుడై సైనికులకున్న మనస్తత్వంలో లేచి నిలబడాలి. సైన్యంలో ఉన్నా లేకున్నా ప్రతీవ్యక్తి సైనిక దృష్టితో శిక్షణ పొందాలి అని ఉద్భోదించాడు. ఈ పట్టుదల ఎంత సముచితమైనదో, మనం ఇప్పుడిప్పుడే గ్రహించగలుగుతున్నాం.
(ముంబైలో ఏర్పాటయిన సావర్కర్ శ్రద్ధాంజలి సభలో ప్రసంగించిన శ్రీ గురూజీ ఉపన్యాసం నుంచి)
0 Comments